Header Banner

బీజేపీలో భారీ మార్పులు.. పార్టీ నేషనల్ చీఫ్ గా అయన నియామకం! మోదీ-షా బలమైన నిర్ణయం!

  Sat Apr 05, 2025 13:27        Politics

ప్రధాని మోదీ - షా ద్వయం కీలక నిర్ణయాలకు తీసుకుంటున్నారు. ప్రతిష్ఠాత్మకంగా భావించిన వక్ఫ్ బిల్లు ఆమోదంతో తదుపరి కార్యాచరణను సిద్దం చేస్తున్నారు. బీహార్ ఎన్నికల పైన గురి పెట్టిన మోదీ - షా ముందుగా పార్టీ జాతీయ అధ్యక్షుడితో పాటుగా రాష్ట్రాలకు అధ్యక్షులను ఖరారు చేస్తున్నారు. ఈ మేరకు సూత్ర ప్రాయంగా ఎంపిక పూర్తయినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రల పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన ఈ ఇద్దరూ పార్టీ నేషనల్ చీఫ్ గా తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తికే ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం. 

 

బీజేపీ చీఫ్ గా
బీజేపీ అధినాయకత్వం కీలక ప్రకటనకు సిద్దం అవుతోంది. జాతీయ అధ్యక్షుడిగా తెలుగు రాష్ట్రాల కు చెందిన నేతకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. జమిలి ఎన్నికల దిశగా కసరత్తు చేస్తున్న వేళ దక్షిణాది పైన స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. అందులో భాగంగా ఆరెస్సెస్ నేపథ్యం.. బీజేపీలో పలు హోదాల్లో కొనసాగిన ఏపీకి చెందిన నేత రామ్ మాధవ్ పేరు ఖరారైనట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో కీలకంగా పని చేసారు. 1981లో ఆయన ఆరెస్సెస్ లో చేరారు. ఆ తరువాత దశాబ్దాల పాటు ఎంతో సేవ చేశారు 2014లో బీజేపీలో చేరి జమ్మూ కాశ్మీర్ లో ఆ పార్టీ తరపున కీలక పాత్ర పోషించారు. జమ్మూలో పీడీఎఫ్ తో కలిసి ప్రభుత్వ ఏర్పాటులో రామ్ మాధవ్ కీలకంగా వ్యవహరించారు. 

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్! పార్టీని విడిచిపోతున్న కీలక నేత! 

 

ఆరెస్సెస్ సిఫార్సు
ఏపీలోని అమలాపురంకు చెందిన రామ్ మాధవ్ కు ఆరెస్సెస్ నేపథ్యం కలిసి వచ్చే అంశం. ఉన్నత విద్యావంతుడు అయిన రామ్ మాధవ్ కు ఇవ్వటం ద్వారా పార్టీ - ప్రభుత్వ సమన్వయంతో పాటుగా పూర్తి స్థాయిలో ఆరెస్సెస్ మద్దతు కూడగట్టవచ్చని భావిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరు సైతం నేషనల్ చీఫ్ పదవి కోసం పరిశీలనకు వచ్చింది. అందుకు కిషన్ రెడ్డి సముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. బీజేపీ వరుసగా గెలిచిన హర్యానా, మహారాష్ట్ర, డిల్లీలో ఆరెస్సెస్ ప్రణాళికా బద్దంగా బీజేపీ విజయానికి పని చేసింది. జమిలికి సిద్దం అవుతున్న వేళ ఆరెస్సెస్ పాత్ర క్రియాశీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. దీంతో, రామ్ మాధవ్ పార్టీలో పలు కీలక సందర్భాల్లో ట్రబుల్ షూటర్ గా వ్యవహరించారనే గుర్తింపు ఉంది. గతంలో తెలుగు రాష్ట్రాల నుంచి బంగారు లక్ష్మణ్, వెంకయ్యనాయుడు బీజేపీ జాతీయాధ్యక్షులుగా పని చేసారు. 

 

తెలుగు రాష్ట్రాలకు
దీంతో, చివరి నిమిషంలో మార్పులు జరిగితే మినహా రామ్ మాధవ్ కు బీజేపీ పగ్గాలు అప్పగింత ఖాయంగా కనిపిస్తోంది. ఇక.. ఏపీలో కొత్త అధ్యక్షుడి నియామకం పైన తుది నిర్ణయం జరగలేదు. మరి కొద్ది రోజులు పురందేశ్వరి కొనసాగింపు అంశం పరిశీలిస్తున్నట్ల తెలుస్తోంది. తెలంగాణలో బండి సంజయ్ ను తప్పించి ఆ స్థానంలో కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించిన తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో ఇప్పుడు మరింత అలర్ట్ అవుతోంది. అధ్యక్షుడితో పాటుగా పార్టీలో కీలక మార్పులకు సమాయత్తం అయినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. దీంతో, అందరినీ కలుపుకొని ముందుకెళ్లే నేతకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు కేటాయించాలని డిసైడ్ అయింది. అధ్యక్షుడి ముది రాజ్ వర్గానికి చెందిన ఎంపీ ఈటల రాజేందర్‌ పేరు ఖరారైనట్లు ప్రచారం సాగుతోంది. అయితే, ఈటెల పేరు ప్రకటన సమయంలో సీనియర్లు తుది ప్రయత్నాలు చేస్తున్నారు. అనూహ్యంగా మురళీధర్‌ రావు, డీకే అరుణ పేర్లు తెర మీదకు వచ్చాయి.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!

 

వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #BJPLeadership #ModiShah #RamMadhav #BJPNationalChief #PoliticalUpdate #TeluguPolitics